విద్యార్థుల హామీలు అమలేవి: ఏఐఎస్ఎఫ్
NEWS Aug 25,2026 03:53 pm
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. తెలంగాణ చౌక్ వద్ద స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, ఖాళీ పర్సులతో నిర్వహించిన వినూత్న నిరసనలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.