అరవింద్ జన్మదినం: పైడిమడుగులో పూజలు
NEWS Aug 25,2026 02:47 pm
కోరుట్ల: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం పురస్కరించుకొని కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామములోని వివేకానంద కాలనీ అభయ ఆంజనేయస్వామి కాలనీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ అరవింద్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు సభ్యులు ఆకువత్తిని నిరంజన్, వినయ్ గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు.