యువకుడి ప్రాణం తీసిన నాటు వైద్యం
NEWS Aug 25,2026 10:18 am
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో ఆవును తోలుకెళ్తున్న పైలా ప్రసాద్‌ను పాము కాటేసింది. నాటు వైద్యుడిని ఆశ్రయించగా కాలికి పసరు మందు రాసి పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసాద్ మృతిచెందాడు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడమే తన కొడుకు మృతికి కారణమని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.