ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగేందుకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని, పర్యాటకులు ఆంక్షలకు సహకరించాలని అధికారులు కోరారు.