సీఎంతో సమావేశమైన ఎంపీ కావ్య
NEWS Aug 24,2026 08:39 pm
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.