బీసీ హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Aug 24,2026 08:38 pm
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో ఉన్న సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.