వెలిగొండ నిర్వాసితులకు మరోవిడత చెక్కుల పంపిణీ
NEWS Aug 22,2026 11:33 am
వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం మరో విడత పరిహారం అందించింది. CM చంద్రబాబు మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని అందించారు. దీంతో ఇప్పటివరకు 6,206 కుటుంబాలకు మొత్తం రూ.768 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు చెల్లించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ 85 శాతం పూర్తయిందని మంత్రి రామానాయుడు తెలిపారు. చివరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామన్నారు.