అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారి
NEWS Aug 22,2026 11:29 am
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 29 నుంచి సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 27న టెండర్లు తెరవనున్నట్లు వెల్లడించారు. 15 రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారికి కలిపే ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభిస్తామన్నారు. మరోవైపు భారీ క్రేన్లు, ఫ్లడ్‌లైట్లతో అమరావతి రాత్రివేళ నిర్మాణ జోరును చాటుతోంది.