మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధం?
NEWS Aug 22,2026 11:36 am
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న సురేఖపై వేటు పడే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిపై పరోక్ష ఆరోపణలు చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపైనా చర్యలు తప్పవన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.