APPSC కి DSCకిఎంత తేడా ఉందో తెలుసా జగన్ రెడ్డి…?
NEWS Aug 22,2026 04:41 pm
ఏపీలో వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అత్యంత పారదర్శకంగా అతి తక్కువ టైంలోనే మెగా డీఎస్సీని నిర్వహించిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతోందని మండిపడుతున్నారు. గొడ్డలి పోటుకు, గుండెపోటుకు ఎంత తేడా ఉందో… APPSCకి, DSCకి అంతే తేడా ఉందన్నారు మంత్రి పార్థసారథి. APPSCలో అక్రమాలు జరిగాయని కోర్టులు నిర్ధారించి విచారణకు ఆదేశించాయని. DSCలో అక్రమాలు జరిగాయని ఇప్పటివరకు ఒక్క కోర్టు కూడా నిర్ధారించలేదన్నారు. అక్రమాల గురించి ఒక్కరు కూడా నిరూపించలేదన్నారు. UPSC, APPSC సంస్థలంటే యువతకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. APPSCలో జరిగిన మూల్యాంకనంపై యువత ఆలోచించాలన్నారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్‍రూమ్‍లో పెట్టకుండా రిసార్ట్స్ లో ఎోందుకు పెట్టారు. వాళ్లకు ఇష్టమొచ్చిన వారితో మూల్యాంకనం చేయించారు. గొడ్డలి పార్టీ వ్యవహరించిన తీరు వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు మంత్రి కొలుసు పార్థసారథి. తోటకూర దొంగిలించినప్పుడే కంట్రోల్ చేసి ఉంటే, గజదొంగ అయ్యేవాడు కాదు. '' అనే సామెత గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డికి సరిగ్గా వర్తిస్తుందన్నారు.