రాయికల్ తహశీల్దార్‌కు షోకాజ్ నోటీస్
NEWS Aug 22,2026 04:42 pm
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్న రాయికల్ తహశీల్దార్ ఎస్.నాగార్జునకు 6 రోజుల్లోనే కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ కోరుతూ మెమో జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. దావన్‌పల్లి, ఉప్పుమడుగు రీ-సర్వే సమస్యలను సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని మెమోలో పేర్కొన్నారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.