ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
NEWS Aug 22,2026 04:41 pm
నిర్మల్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగ పరుచుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ నాయకులు ముత్యంరెడ్డిని శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డు తీసుకోవాలని సూచించారు. నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి శంకర్, కమిటీ సభ్యులు బూడిదల రాజేశ్వర్ పాల్గొన్నారు.