చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. చిరంజీవి ఇతరులను తొక్కేసారని కొందరు మాట్లాడుతుంటారు. చిరంజీవి ఎవరినీ తొక్కడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్, నిజాయితీ ఉంటే వాళ్లను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం అని చెప్పారు.