సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
NEWS Aug 22,2026 09:31 am
అనకాపల్లి: CM చంద్రబాబు నేడు (22న) ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ రూట్, బందోబస్తుపై సమీక్షించి, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.