మహిళ హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
NEWS Aug 21,2026 09:25 pm
కరీంనగర్: అప్పు ఇవ్వలేదన్న కక్షతో మహిళను మట్టుబెట్టిన కేసులో నిందితుడు తాడగొండ దామోదర్‌కు జీవిత ఖైదు, ₹3,000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పునిచ్చారు. 2023లో దేశ్రాజ్‌పల్లికి చెందిన మామిడిపల్లి అనిత (50)ను హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు నేరం రుజువైంది. సరైన ఆధారాలు లేకపోవడంతో రెండో నిందితుడు శివకుమార్‌ను కోర్టు విడుదల చేసింది.