మట్టి, ఇసుక లభ్యత కోసం సులభతర విధానాన్ని రూపొందించాలి
NEWS Aug 21,2026 09:25 pm
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన మట్టి ఇసుక లభ్యత కొరకు సులభతరమైన విధి విధానాలను రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో శాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.