రత్నగిరిపల్లిలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
NEWS Aug 21,2026 09:29 pm
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జక్కుల నవీన్, ఉపాధ్యక్షుడిగా పడిగే కృష్ణ ఎన్నికయ్యారు. యూత్ ప్రెసిడెంట్‌గా పొన్నాల శివాజీ, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కామటి మధు, యూత్ ఉపాధ్యక్షుడిగా భద్రవేణి మహేష్ బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిటీ సభ్యులకు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.