మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
NEWS Aug 21,2026 04:36 pm
నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు, పాఠశాల, ఆసుపత్రి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. లబ్ధిదారుల సమస్యలను విన్న మంత్రులు స్పందిస్తూ.. 3 నెలల్లోపు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.