రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ నేడు విడుదలైంది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరో అయ్యప్ప మాలధారణలో ఉన్న సన్నివేశాలు వచ్చినప్పుడు.. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో స్క్రీన్‌లకు హారతులు ఇస్తోన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొందరు స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్స్‌లు చేస్తోన్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి.