తల్లి గొంతు కోసి కొడుకు ఆత్మహత్య
NEWS Aug 21,2026 08:34 am
వెల్ది గ్రామంలో వడ్డూరి శ్రావణ్ కుమార్ (33) అనే వ్యక్తి తన తల్లి దుర్గమ్మ గొంతు కత్తితో కోసి, అనంతరం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన తల్లిని స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.