విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
NEWS Aug 21,2026 08:49 am
విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను మంత్రి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులతో ముచ్చటించి వారి చదువులు,వసతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు కరకులం ఆక్టివిటీస్ ను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.