లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ
NEWS Aug 21,2026 08:59 am
శంకరపట్నం: తండ్రి నుంచి ఆస్తి మార్పిడి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన జీపీఓ (GPO) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మొలంగూర్ గ్రామానికి చెందిన బాధితుడు జూలై 21న స్లాట్ బుక్ చేసుకోగా, క్షేత్రస్థాయి విచారణను ఆలస్యం చేస్తూ కంపేటి శ్రీనివాస్ రూ. 20 వేలు లంచం అడిగారు. బాధితుడి ఫిర్యాదుతో వ్యూహాత్మకంగా దాడి చేసిన ఏసీబీ బృందం, తహశీల్దార్ కార్యాలయంలో ఆ సొమ్మును స్వీకరిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు డి.ఎస్.పి మహేందర్ రెడ్డి తెలిపారు.