వెలిగొండ నిర్వాసితులకు 200కోట్ల పరిహారం
NEWS Aug 20,2026 02:27 pm
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.200 కోట్ల పరిహారం చెక్ ని అందచేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో నిర్వాసితులను కలిసిన సీఎం.. వారికి చెక్కును అందజేశారు. ప్రాజెక్టుతో పాటు నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి ముఖ్యం అన్నారు మంత్రి రామానాయుడు. వెలిగొండ నిర్వాసితుల 4 కాలనీల్లో మౌలిక వసతులు పూర్తిచేశామన్నారు. మిగిలిన కాలనీల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. వెలిగొండ నిర్వాసితులకు మిగిలిన రూ.400కోట్లు కూడా త్వరలోనే చెల్లించి ఈ నెలలోనే నల్లమల్ల సాగర్ కు నీరిస్తాం అన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వెలిగొండ నిర్వాసితులను గొడ్డలి పార్టీ దారుణంగా మోసగించిందన్నారు. పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత ఆ పార్టీ నాయకుడికే చెల్లిందని ఎద్దేవా చేశారు. చెప్పినట్లే మార్కాపురం జిల్లా చేశామని.. వెలిగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే తిరిగి ప్రారంభిస్తున్నారన్నారు. నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయాలని కోరుతున్నాం అన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.