తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై నివేదిక
NEWS Aug 20,2026 02:25 pm
కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 70 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు.చిన్నారి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది జి.శ్రీకాంత్ ఇటీవల పిటిషన్ వేశారు. పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. జ్ఞానేశ్వరి అదృశ్యంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. పోలీసులు డ్రోన్లు, జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించినా స్పష్టమైన క్లూ దొరకలేదు. ఎవరైనా అపహరించి ఉంటే, ఆమెను తమకు అప్పగించాలని పోలీసులు సైతం స్పష్టం చేశారు. వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయమని తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి పురోగతి లేదు. దర్యాప్తులో భాగంగా 15వేల ఫోన్ కాల్‌లను విశ్లేషించారు.