అమరావతిలో 2,344 ఎకరాల భూసమీకరణ
NEWS Aug 20,2026 02:22 pm
AP రాజధాని అమరావతిలో మరోసారి భూ సమీకరణకు రంగం సిద్ధం అయింది. అమరావతిలో 2,344.12 ఎకరాల భూసమీకరణకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎర్రబాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి భూసమీకరణ చేయనున్నారు. తాడికొండ మండలం మోతడకలో 2344 .12 ఎకరాల భూ సమీకరణ చేస్తారు. మోతడకలో 689.8 61 ఎకరాల భూసమీకరణకు అంగీకరించింది. మోతడకలో 1,62,744 పట్టాభూమి, 26 81 9 ఎకరాల అసైన్డ్ భూమి సేకరణకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 7 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో రైల్వే లైన్ కోసం 39.74 ఎకరాల భూ సమీకరణ చేయనున్నారు.