గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి
NEWS Aug 19,2026 08:34 pm
కరీంనగర్ : గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గురువారం గోసమేత తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి, 200 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.