ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఆగిపోయాయా?
NEWS Aug 19,2026 08:17 pm
ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే బుగ్గారంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోయాయనే ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు. బుగ్గారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. 40 మంది లబ్ధిదారుల బిల్లుల అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ఆర్టీఐ కారణంగానే బిల్లులు నిలిచిపోయినట్లయితే వివరాలను, ప్రచారం అవాస్తవమైతే బాధ్యులపై చర్యలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.