రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం అందుకున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్
NEWS Aug 19,2026 08:34 pm
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో ఆర్‌ఎస్‌ఐగా పనిచేస్తున్న క్లూస్ టీమ్ ఇన్‌చార్జ్ సిరికి లక్ష్మీ నరసింహారావు రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకం-2024 అందుకున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 43 ఏళ్ల పోలీస్ సేవలో 25 ఏళ్లుగా క్లూస్ టీమ్‌లో సేవలందించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.