ప్రిన్సిపల్‌ను చంపింది పదో తరగతి విద్యార్థులే?
NEWS Aug 19,2026 06:00 am
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సుమారు 80 మందిని విచారించిన పోలీసులు, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం వద్ద వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం సుమారు రూ.4 లక్షల నగదు చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.