పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లు
NEWS Aug 19,2026 09:47 am
రాయికల్: కుమ్మరిపెల్లి గ్రామంలో తునికి జయ నాగరాజు, బొప్పరపు కమల బాలరాజు, మాధురి సాయి వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పేద కుటుంబాలకు కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. సొంత ఇంటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.