అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ ఆకస్మిక తనిఖీ
NEWS Aug 18,2026 08:43 pm
రాయికల్ పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను అదనపు సీడీపీఓ రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రీస్కూల్ కార్యకలాపాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పనులను పరిశీలించి టీచర్లకు పలు సూచనలు చేశారు. పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు ఆన్‌లైన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో లోపాలను సరిదిద్దుకుని మెరుగైన సేవలు అందించాలని సూచించారు.