పంటల సస్యరక్షణపై రైతులకు అవగాహన
NEWS Aug 18,2026 08:43 pm
భీమారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు వివిధ పంటల్లో సస్యరక్షణ చర్యలు, నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జగిత్యాల జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ. విజయ్ భాస్కర్ క్షేత్ర సందర్శనలు చేసి వరి, పత్తి, పసుపు, కంది, మొక్కజొన్న, కూరగాయ పంటల సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. నానో యూరియా ప్లస్, నానో డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.