మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్ లో వైద్య శిబిరం
NEWS Aug 18,2026 08:42 pm
వెల్గటూర్ మండలం కోటిలింగాల మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర హాస్టల్‌లో మెడికల్ ఆఫీసర్ డా.తేజశ్రీ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా.సమీనా ఆధ్వర్యంలో ఉచిత యునాని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అల్లోపతి, ఆయుష్ మందులను అందించారు. విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని, అన్నం తినే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పించారు.