రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన
NEWS Aug 18,2026 08:42 pm
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా.జైపాల్ రెడ్డి సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.