₹20 ప్రీమియంతో ₹2 లక్షల బీమా
NEWS Aug 18,2026 08:41 pm
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రాయికల్‌కు చెందిన చొప్పదండి నర్సయ్య కుటుంబానికి ₹2 లక్షల బీమా పరిహారం అందింది. నర్సయ్య యూనియన్ బ్యాంకులో ఈ పథకాన్ని తీసుకోగా, ప్రమాదంలో మృతి చెందడంతో బ్యాంకు శాఖ మేనేజర్ ఎస్. నరేష్ కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని అందజేశారు. తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ సూచించారు.