సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కొరడా
NEWS Aug 18,2026 05:33 pm
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ వినియోగించిన వారికి జరిమానాలు విధించారు. ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచులు, గాజు బాటిళ్లు, కాగితపు ప్లేట్లు వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.