సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. సామాజిక న్యాయ పోరాటాలతో బహుజన రాజ్యాధికార సాధనలో స్వయం సమృద్ధ గ్రామీణ పాలనలో పాపన్న ప్రస్తానికి అత్యున్నత చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.