పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన
NEWS Aug 18,2026 08:30 pm
కసింకోట: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖరరావు మంగళవారం అచ్చర్ల, సుందరయ్యపేట, కన్నూరుపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, సౌకర్యాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎంపీడీవో తెలిపారు.