మండల అభివృద్ధికి ఎంపీ నిధులు ఇవ్వాలి
NEWS Aug 18,2026 04:40 pm
కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో బీజేపీ నాయకులు కలిసి కథలాపూర్ మండల అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీకి మండల బీజేపీ శాఖ తరఫున నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షుడు రాచమడుగు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు బద్రి సత్యం, కథలాపూర్ మహేష్, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.