డ్రగ్స్, పోక్సో చట్టంపై అవగాహన
NEWS Aug 18,2026 04:42 pm
కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ పి. గోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సై ఎ. నరేష్ విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, పోక్సో చట్టం, బాలల రక్షణపై అవగాహన కల్పించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, చెడు స్నేహాలకు లోనుకాకుండా భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.