ముస్లిం స్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
NEWS Aug 18,2026 04:43 pm
బుచ్చయ్యపేటలో ముస్లిం స్మశాన వాటిక ఉంది. గత 80 ఏళ్లుగా ఇక్కడే మృతదేహాలను ఖననం చేస్తున్నారు. స్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురైందని ఆరోపిస్తూ ఆక్రమణలను తొలగించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఆర్‌ఓ లక్ష్మికి, ఎస్సీ కమిషన్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.వి. నాయుడు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వి. చిరంజీవి పాల్గొన్నారు.