ఆలూరులో ‘AXL ల్యాబ్’ ప్రారంభం
NEWS Aug 18,2026 04:35 pm
రాయికల్ మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాలలో ‘AXL ల్యాబ్’ను జిల్లా విద్యాశాఖాధికారి రాము, AMO చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ నల్లాల స్వామి, ఉప సర్పంచ్ మహేష్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో AI ఆధారిత విద్యాబోధనతో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, గణితంలో సులభంగా నైపుణ్యాలు సాధిస్తున్నారని DEO తెలిపారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన ప్రగతిని పరిశీలించారు.