రేకుర్తిలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
NEWS Aug 18,2026 08:35 pm
కరీంనగర్: బహుజన వీరుడు, విప్లవ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రేకుర్తి చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన ధైర్యసాహసాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.