తైపురం గ్రామ సచివాలయం పేరు సవరించాలి
NEWS Aug 18,2026 08:35 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం పేరును కొన్నిచోట్ల ‘టైపురామ్’గా తప్పుగా నమోదు చేశారు. వాస్తవానికి గ్రామం పేరు ‘తైపురం’. అధికారిక రికార్డులు, నేమ్‌బోర్డులు, ప్రభుత్వ పత్రాల్లోనూ తైపురం పేరునే ఉపయోగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు అక్షర దోషాన్ని వెంటనే సరిచేసి అన్ని ప్రభుత్వ రికార్డుల్లో తైపురం గ్రామ సచివాలయంగా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.