కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ నాయకుల అరెస్టు
NEWS Aug 18,2026 08:36 pm
కరీంనగర్ : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం పలువురు ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రానికి (పీటీసీ) తరలించారు.