పరవాడలో బొగ్గు లారీలపై CITU నిరసన
NEWS Aug 18,2026 08:37 pm
పరవాడ ప్రాంతాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని, హిందూజా బొగ్గు లారీల రాకపోకలను నిలిపివేయాలని సీఐటీయూ నాయకులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సినిమా హాల్ జంక్షన్‌లో నిరసన చేపట్టారు. లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. బొగ్గును రైలు మార్గంలో తరలించాలని, రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.