కరీంనగర్ బైపాస్ రోడ్డు డంప్ యార్డ్‌పై మండిపడ్డ తెరణాసే
NEWS Aug 18,2026 08:38 pm
కరీంనగర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డ్‌ను నగరానికి దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. చెత్త వల్ల వస్తున్న దుర్వాసన, పొగతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, బయోమైనింగ్ ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.