చోడవరం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి
NEWS Aug 18,2026 08:39 pm
చోడవరం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ భీమునిపట్నం–నర్సీపట్నం రహదారిని అభివృద్ధి చేసి గుంతలు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.