ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం
NEWS Aug 18,2026 08:40 pm
కొండగట్టు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వైద్యాధికారులకు సూచించారు. మల్యాల మండలం కొండగట్టు వద్ద సోమవారం రాత్రి ఆర్టిసి బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్ర గాయాల పాలు కాగా, వారందరినీ చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు.