ఘనంగా శ్రీరామ హృదయకలశ యాత్ర
NEWS Aug 17,2026 11:52 pm
రాయికల్ మండలం కొత్తపేట నాగాలయంలో చిన్నజీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ హృదయ కలశ యాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో పాదయాత్ర చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.